గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే టోర్నమెంట్లు

 మంత్రి మల్లారెడ్డి

నవతెలంగాణ – ఘట్కేసర్‌
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రతి ఏటా టోర్నమెంట్లను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్‌ మండలం కాచవాని సింగారంలోని ఓ క్రికేట్‌ గ్రౌండ్‌లో చివరి రోజైన ఆదివారం నిర్వహించిన మల్లారెడ్డి క్రికెట్‌ టోర్నమెంట్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాచవాని సింగారం, చౌదరిగూడ జట్ల మధ్య హౌరా హౌరీగా జరిగిన ఫైల్‌ మ్యాచ్లో విజేతగా నిలిచిన చౌదరిగూడ జట్టుకు మంత్రి ట్రోపితో పాటు రూ.50వేలు, రన్నర్‌ టీమ్‌గా నిలిచిన కాచవాని సింగారం జట్టుకు ట్రోఫితో పాటు రూ.25వేలు అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ క్రీడాకారులు నిత్య సాధనతోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని, ఇలాంటి టోర్నమెంట్లు క్రీడాకారులకు ఎంతో ఉపయోగప డుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, పోచారం మున్సిపాలిటీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌ రెడ్డి, సర్పంచులు కొంతం వెంకట్‌ రెడ్డి, ఓరుగంటి వెంకటేష్‌ గౌడ్‌, నల్లో యాదగిరి, ఎంపీటీసీ నీరుడి రామారావు, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్‌, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌ రెడ్డి, ఘట్కేసర్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు డొంకని భిక్షపతి గౌడ్‌, నీరుడి శ్రీనివాస్‌, మంకం రవి, మంకయ్య, బొడిగె ఐలేష్‌ యాదవ్‌, మేకల నర్సింగ్‌ రావు, నీరుడి కుమార్‌, కట్ట కష్ణ, నీరుడి సురేష్‌, చింతపంటి జంగయ్య, నీరుడి హరీష్‌, బండారి మోగుల్ల ఆంజనేయులు గౌడ్‌, ఎర్రోళ్ళ శ్రీనివాస్‌, బొడ్డు నాగార్జున, దయ్యాల ఆంజనేయులు, మణ్యం, ఉడుగుల సత్యనారాయణ, సంతోష్‌ కుమార్‌ గౌడ్‌, రాజగోని మహేష్‌, వడ్త్యా పవన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచిన మహారాజు కేసీఆర్‌
నవతెలంగాణ-జవహర్‌నగర్‌
దివ్యాంగులకు సమాజంలో మరింత ఆత్మగౌర వం పెరిగిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌ నగర్‌ కార్పొరేషన్‌ లోని డీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో మేయర్‌ మేకల కావ్య ఆధ్వర్యంలో దివ్యాంగులకు పింఛన్‌ రూ. 4,016కు పెంచినందుకు సీఎం కేసీఆర్‌ కు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల కు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల హదయాల్లో ఎప్పటికి నిలిచిపో తారని అన్నారు. అంగవైకల్యం శారీరానికే కానీ… మనసుకు కాదని, దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. పెంచిన పింఛన్‌తో తెలంగాణలోని 5లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. 1000 మంది దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేసిన మంత్రి మల్లారెడ్డి వారికి వడ్డించి సహఫంక్తి భోజనం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం చేశారు. దివ్యాంగుడికి మంత్రి స్వయంగా అన్నం తినిపించి గొప్ప మానవత దక్పథం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాల్టీ చైర్మెన్‌ ప్రణీత, నాగారం మున్సిపాలిటీ చైర్మెన్‌ చంద్రారెడ్డి, జవహర్‌ నగర్‌ కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ ఆర్వో ప్రభాకర్‌ యాదవ్‌ , జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప, బీఆర్‌ఎస్‌ స్థానిక పార్టీ అధ్యక్షుడు కొండల్‌ ముదిరాజ్‌, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love