
నవతెలంగాణ – మద్నూర్
గుర్తుతెలియని వ్యాపారులు అక్రమంగా ఆవులను తరలిస్తూ చనిపోయిన ఆవును మద్నూర్ మండలంలోని మేనూర్,శాఖాపూర్, గ్రామ శివారు ప్రాంతంలో 161 వ జాతీయ రహదారి పక్కన వదిలేసిన ఒక చనిపోయిన ఆవు మరొక వాటిని వదిలేయడం రోడ్డు పక్కన పడి ఉన్న ఆవులను చూసి ఒక ఆవు చనిపోయినట్లు మేనూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై విజయ్ కొండ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. చనిపోయిన ఆవుకు మెనూర్ గ్రామ పెద్దలు అన్నింటికీ తానే అనే విధంగా ప్రతి ఒక్క పనికి సహకరించే వై గోవిందు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ్ కొండ పాల్గొని పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతం నుండి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు వైపు ఆవులు అక్రమంగా తరలి వెళుతున్నాయి అనడానికి రోడ్డు పక్కన వదిలేసిన ఆవులే నిదర్శనం. గోవులను అక్రమంగా తరలిస్తూ గోజ కసాయి వాళ్లు హత్య చేస్తున్నారని ఆరోపణలు మండల ప్రజలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన ఆవుకు వై గోవిందు ఇటుక బట్టి సమీపంలో భక్తిశ్రద్ధలతో అంత్యక్రియలు జరిపి పూడిచిపెట్టారు.