నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఇవాళ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఇందులో 30 నిమిషాల పాటు విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ తో పాటు పరిసన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు పోలీసులు. వాహన దారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక ఇవాళ, రేపు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలు జరుగనున్నాయి.