నగరంలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

traffic diversion న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
నేడు నగరంలో జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా గోషామహల్‌, సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఠాణా పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సీతారాంబాగ్‌ ఆలయం వద్ద శోభయాత్ర ప్రారంభమై..సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్‌ వ్యాయమశాల వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ వెల్లడించారు. కాగా, శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు యాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఉండే ప్రార్థన మందిరాలు బయటకు కనిపించకుండా పరదాలతో మూసేశారు. మతపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పండుగల సందర్భంగా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంటారు.

Spread the love