నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలోఎవ్వరూ కూడా అపోజిట్ డైరెక్షన్లో వాహనాలు నడుపరాదు అని, ట్రాఫిక్ ఆంక్షలు తప్పకుండా పాటించాలని నిజామాబాద్ ఇన్చార్జి కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. అలా నడపడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. ఎవ్వరయిన ఆపోజిట్ డైరెక్షన్లో వాహనాలు నడిపినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి. కమాండ్ కంట్రోల్ ద్వారా సి.సి కెమెరాల ద్వారా గమనించి వారిపై తగు చర్యలు తీసుకోబడుతాయని, ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వాహనాలు నడిపే వారి పట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని నిజా మాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.