వడ్తల్ కు రాకపోకలు బంద్..

– వంతెన పై పొంగిపొర్రుతున్న వరద నీరు
నవతెలంగాణ-ముధోల్:  ఎడతెరిపిలేని  బారీ వర్షాలతో  ముధోల్  మండలంలోని  వడ్తల్  వంతెన పైనుండి వరద నీరు ఉదృతంగా  ప్రవహించడంతో రాకపోకలు బుధవారం తెల్లవారుజాము నుండి నిలిచిపోయాయి. దీంతో  గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారు ఇబ్బందులు తప్పడం లేదు.  అలాగే బోరేగాం లో లెవెల్ వంతెన బ్రిడ్జి పైనుండి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. ఈవిషయం తెలుసుకున్న   తాసిల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ నారాయణ పటెల్ ముధోల్  ఎస్ఐ సాయికిరణ్ తన సిబ్బంది వేళ్లి వరద ఉధృతిని పరిశీలించారు. పలు వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు ఉధృతి కొనసాగుతుండడంతో  వడ్తల్  వంతెన పై నుండి రాకపోకలు చేయకూడదని  ముధోల్  ఎస్ఐ సూచించారు. పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
Spread the love