శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విషాదం.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గోవా నుంచి వచ్చిన నితీష్ షా, జెడ్డా నుంచి వచ్చిన షేక్ సకినా మృతి చెందారు. ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత ఒక్కసారిగా ఇద్దరికి అస్వస్థత నెలకొంది. దీంతో ఎయిర్ పోర్ట్ అపోలో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ వీరిద్దరు మృతి చెందారు.

Spread the love