విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి

నవతెలంగాణ – హైదరాబాద్:  పార్టీ సీనియర్‌ నాయకుడు, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ఖాన్‌(78) మంగళవారం కన్నుమూశారు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మురాబాద్‌నగర్ కార్పొరేటర్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1989లో తొలిసారిగా చార్మినార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నూతనంగా ఏర్పడిన నాంపల్లికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు MIM పార్టీ సీనియర్‌ నాయకుడు, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ఖాన్‌. ఇక నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ఖాన్‌ మృతి పట్ల ఎంఐఎం పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

Spread the love