నవతెలంగాణ – ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో రాఖీ పండుగ రోజున విషాదం చోటు చేసుకుంది. బానోత్ షమీనా అనే మహిళ బట్టలు ఆరవేస్తుండగా.. ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమె అరుపులు విన్న భర్త శ్రీను.. ఆమెను కాపాడే ప్రయత్నంలో అతను కూడా విద్యుదఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.