తీవ్ర విషాదం.. రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి

నవతెలంగాణ – నాగర్‌కర్నూల్‌ : నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన తాడూరు శివారులో ఆదివారం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కూలీలు, ఇంటి యజమాని మల్లేష్, పదేండ్ల చిన్నారి ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

Spread the love