ఢిల్లీ మార్చ్‌లో విషాదం.. రైతు గుండెపోటు మృతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ: నిరసనలో పాల్గొన్న వృద్ధ రైతు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతమైన శంభులో ఈ సంఘటన జరిగింది. కనీస మద్దతు ధరతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి పెద్ద ఎత్తున నిరసనకు ఢిల్లీ బాటపట్టారు. అయితే హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించారు. కాగా, శుక్రవారం ఉదయం 78 ఏళ్ల రైతుకు గుండెపోటు వచ్చింది. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు రాజ్‌పురాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాటియాలాలోని ప్రభుత్వ రాజింద్ర ఆస్పత్రికి అతడ్ని రిఫర్ చేశారు. అక్కడకు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తుండగా ఆ వృద్ధ రైతు మరణించాడు. మృతుడ్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జ్ఞాన్ సింగ్‌గా గుర్తించారు. తొలి విడత నిరసనలో కూడా పలువురు రైతులు చనిపోయారు.

Spread the love