మేడారంలో విషాదం.. సమ్మక్క తల్లి పూజారి మృతి

Dasarathamనవతెలంగాణ – ములుగు: జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సమ్మక్క తల్లి పూజారి సిద్దబోయిన దశరథం అనారోగ్య కారణాలతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం దశరథం అన్న సిద్ధబోయిన లక్ష్మణరావు సైతం అనారోగ్య కారణాలతో మరణించారు. స్వల్ప వ్యవధిలోనే అన్నదమ్ముల మరణంతో మేడారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, దశరథం మృతిపట్ల పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలోనే సోదరులిద్దరు మృతి చెందడం బాధాకరమన్నారు.

Spread the love