సంగారెడ్డి జిల్లాలో విషాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : నాలుగేళ్ల కూతురితో సహా తల్లి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాయికోడ్ మండలం శిరూరులో ఈ విషాద ఘటన జరిగింది. నాలుగేళ్ల కూతురుతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు విజయ (32), గౌరి (4)గా గుర్తించారు. అయితే చిన్నారితో పాటు ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది.

Spread the love