సికింద్రాబాద్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్య

నవతెలంగాణ – సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని భవానీనగర్‌లో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను విజయలక్ష్మి, కుమార్తెలు చంద్రకళ, సౌజన్యగా గుర్తించారు. ఇటీవల విజయలక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దాంతో అప్పటి నుంచి విజయలక్ష్మి, ఆమె ఇద్దరు పిల్లలు తట్టుకోలేకపోయారు. మానసికంగా ఆందోళనకు తల్లీ కూతుళ్లు ఇంట్లోని ఒక్కో గదిలో ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రకళ ఎంబీఏ చదువుతుండగా.. సౌజన్య దివ్యాంగురాలు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love