తెలుగు సినీ పరిశ్రమలో విషాదం…

నవతెలంగాణ – హైదరాబాద్
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ దర్శకుడు ఎన్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ (49) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా రామానాయుడు నిర్మించిన ‘నిరీక్షణ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ‘శత్రువు’, నవదీప్ హీరోగా ‘నటుడు’ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన ఇండస్ట్రీలో ‘సీతారామ్’గా సుపరిచితులు. ఎన్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. ఆయన ప్రముఖల దర్శకుల వద్ద రచయితగా పని చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన మూవీ మొఘల్‌ దివంగత డీ రామానాయుడు తన నిర్మాణ సంస్థలో తొలిసారిగా దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘రెక్కీ’ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. త్వరలో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రసాద్‌ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది.

Spread the love