నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఐఎల్పీఏ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం వివేరా హోటల్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో యువ న్యాయవాదులకు వివిద చట్టాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్ రావు ప్రారంభించి మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం తమను తాము అప్డేట్ చేసుకోవాలన్నారు. అనంతరం భువనగిరి ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే.మురళి మోహన్ రావు ,భువనగిరి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వర్ రావు,బార్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ కె.సునీల్ గౌడ్ ఐఎల్ పిఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం విజయదేవరాజు గౌడ్ మాట్లాడారు. న్యాయవాదులు ఎంత సుశిక్షుతులైతే న్యాయవ్యవస్థ అంతగా మెరుగ్గా న్యాయాన్ని అందించగలదన్నారు. ఈ శిక్షణ తరగతులకు అడ్వకేట్ పొడిచేది శ్రీనివాస్, గజ్జల వెంకటరెడ్డి, కిరణ్ కుమార్, నాగరాజు, లత, కాంతా చారి ఫ్యాకల్టీగా వ్యవహరించారు. ఐఎల్ పీఏ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గజ్జల వెంకట రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లెల సౌజన్య, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య, భువనగిరి బార్ అసోసియేషన్ మాజి ప్రెసిడెంట్ జి వెంకటేశ్వర్లు, ఐ ఎల్ పి ఏ అడ్వకేట్స్ సిద్ధిరాములు, సామ్సన్, గాంగేయుడు, లక్మీదేవి, సురేష్ కుమార్, మల్లేష్, భాస్కర్ తో పాటుగా భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు , రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు.