మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రామ పంచాయతీ మంచి నీటి సహయకులకు శిక్షణ అందించారు. ఈ క్రమంలో ఎంపీడీఓ వెంకట రమేష్ మాట్లాడుతూ.. వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొనీ ప్రజలకు మంచి నీటిని అందించేందుకు నీటి ట్యాంకులను బ్లీచింగ్ తో ప్రతి నెల క్లోరినేషన్ చేయాలని, పైప్ ల లీకేజి లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని వెల్లడించారు. లేని యెడల నీరు కలుషితమై ప్రజలు ఆ నీటిని తాగి వ్యాధుల భారిన పడతారని దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నీటి సేహాయకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా వారికి గ్రామాలలో చేతి పంపులు చెడిపోయినప్పుడు ఏవిధంగా బాగు చెయ్యాలి, నీటి నాణ్యత ఎంత ఉండాలి అనే అంశాల పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ శ్రీకాంత్, ఎంపీఓ సోలమన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.