త్వరలో నిర్వహించే సామాజిక, ఆర్థిక సర్వే 2024 కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మండల ఎంపీడీఓ శ్యామ్ సుందర్, తహశీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కొయ్యుర్ రైతువేదికలో ఎన్యుమరేటర్లకు, సూపర్ వైజర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్నీ శిక్షణ ట్రైనర్ ఏఎస్ఓ శివకృష్ణ శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ మాస్టర్ మాట్లాడారు. శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లకు నిష్టాతులు కావాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కుటుంబాల సమగ్ర సమాచార సేకరణ, ప్రతి కుటుంబం, సామాజిక, ఆర్థిక, రాజకీయ కులాల వారిగా సర్వేలో వివరాలను నమోదు చేయడంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.