నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పివి నరసింహారావు పశువైద్యశాల రాజేంద్రనగర్, జిల్లా పరిషత్ సమర్దక శాఖ ఆధ్వర్యంలో రాయగిరిలో సమీకృత దాణ తయారి పై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు భువనగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఏం ప్రత్యూష తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జే నరసింహ మాట్లాడుతూ సమీకృత దాణ యొక్క ఆవశ్యకతను, వాడే విధానం పై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ సుధీర్ బాబు, డాక్టర్ రామకృష్ణ లు మాట్లాడుతూ పశు గ్రాసం, పశు పోషణ పై ఎలా చేయాలి అనే విషయాలను రైతులకు వివరించారు. అఖిల భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక వారి ఆర్థిక సహాయంతో 30 మంది షెడ్యూల్ కులాల వారికి పశుపోషణకు సంబంధించిన దాణను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయ సంచాలకులు డాక్టర్ కే గోపిరెడ్డి, పశువైద్యలు డాక్టర్ ఎం ప్రత్యూష, డాక్టర్ నవీన్ సిబ్బంది, 30 మంది పార్టీ రైతులు పాల్గొన్నారు.