నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల లో “కమ్యూనికేషన్ స్కిల్స్ , న్యూస్ ప్రెజెంటేషన్ పై విద్యార్థులకు శిక్షణ”, న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవం ,లోగో ఆవిష్కరణ సోమవారం నిర్వహించినారు. ప్రముఖ పాత్రికేయులు, న్యూస్ రీడర్ శ్రీ గౌతమ్ శ్రీ భాషిత న్యూస్ ఛానల్, లోగో ఆవిష్కరణ చేసినారు.. ఈ కార్యక్రమంలో గౌతమ్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ న్యూస్ ప్రజెంటేషన్ పై కార్యశాల నిర్వహించి, ప్రారంభమైన నూతన విద్యా సంవత్సరాన్ని అధికారికంగా ప్రారంభించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు మాట్లాడడంలో ఉన్న మెలకువలు తెలిపినారుఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కావలసింది కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ కమ్యూనికేషన్స్ స్కిల్స్ విద్యార్థులు అభివృద్ధి పరచుకోవడానికి ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్ టి. గౌతo చే కార్యశాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ పాల్గొన్నారు.