ఆధ్యాత్మికంతోనే ”ప్రశాంతత”

సర్పంచ్‌ కె.రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
ఆధ్యాత్మికం ప్రశాంతతకు ఉపయోగపడుతుందని దోమ సర్పంచ్‌ కె.రాజిరెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం దోమ మండల కేంద్రంలో శివపాండురంగ విఠల ఆంజనేయ స్వామి దేవాలయంలో, దర్గా దగ్గరా అందరితో కలిసి అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా వారంలో కనీసం ఐదు రోజులు దేవాలయాల్లో ఆధ్యాత్మికం పేరుతో కొంత సమయం గడిపితే ప్రశాంతతతో పాటూ ఆరోగ్యం బాగుంటుందని సర్పంచ్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు. శివాలయంలో పూజలు దర్గా దగ్గర ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలలో పాల్గోన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గోపాల్‌ గౌడ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు ఖాజా పాష, వార్డు సభ్యులు మైను, మహిళా సంఘాల ప్రతినిధులు జ్యోతి, భాగ్యలక్ష్మి, మహిళా మణులు కె.సుజాతరాజిరెడ్డి, పీ.జయమ్మ, కొండమ్మ, లావణ్య, రామేశ్వరి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, రహీమ్‌, గౌస్‌, అర్చకులు శేషాద్రి రావు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

Spread the love