అక్రమ విద్యుత్ కలెక్షన్లపై ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకోవాలి..

– ఇరిగేషన్ డి ఈ ఈ వెంకటేశ్వర్లు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
పోచారం ప్రధాన కాలువలో అక్రమంగా మోటార్లను పెట్టి స్టార్టర్ డబ్బులకు విద్యుత్ వైర్లను పెడుతున్న రైతులపై ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకోవాలని డి ఈ ఈ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం రోజు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మాలతో మీద నుండి రాఘవపల్లి వరకు అక్రమ మోటర్ల కలెక్షన్లను వారు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచారం ప్రధాన కాలువపై అక్రమంగా 400కు పైగా మోటార్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అక్రమంగా మోటార్లను పెట్టడం కాకుండా స్టార్టర్ డబ్బులకు విద్యుత్ షాక్ తగిలే విధంగా వైర్లను బిగిస్తున్నారని స్టాటర్ డబ్బులు ప్రమాదకరంగా ఉంటున్నాయని ఆయన అన్నారు. రైతులెవరు పోచారం కెనాల్ పరిసరాల్లో ఉన్న స్టార్టర్ డబ్బులను తాకకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకోవాలని డి ఈఈ పేర్కొన్నారు.
Spread the love