13 మంది ఐఏఎస్‌ల బదిలీ

Transfer of 13 IAS– పర్యాటక శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌
– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ కార్యదర్శిగా కూడా ఆమె అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయిన ఇ. శ్రీధర్‌కు దేవాదాయ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి, రవాణా శాఖ కమిషనర్‌గా కే సురేంద్ర మోహన్‌ను, డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న కృష్ణభాస్కర్‌ను ట్రాన్స్‌ సీఎండీగా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న సీహెచ్‌ హరికిరణ్‌ను ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా, శివశంకర్‌ లాహౌటిని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా, జి.సృజనను పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా, చిట్టెం లక్ష్మిని ఆయూష్‌ డైరెక్టర్‌గా ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజరుకుమార్‌ను కార్మిక శాఖ కమిషనర్‌గా, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెన్షియల్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌కు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల సమన్వయ కర్తగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Spread the love