నవతెలంగాణ – తమిళనాడు: రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిలో ఇద్దరు పదోన్నతులు పొందారు. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అముద ఉత్తర్వులు జారీ చేశారు. పొల్లాచ్చి డీఎస్పీగా ఉన్న బృంద ఎస్పీగా పదోన్నతి పొంది, సేలం ఉత్తరం డిప్యూటీ కమిషనర్‌గా నియమితు లయ్యారు. ఈరోడ్ సత్యమంగళం డీఎస్పీ అయిమన్ జమాల్‌కు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ, ఆవడి శాంతి భద్రతల విభాగం డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. సేలం ఉత్తరం డిప్యూటీ కమిషనర్ గౌతమ్ గోయల్ తాంబరం శాంతి భద్రతల డిప్యూటీ కమిషనర్‌గా, ఆవడి శాంతి భద్రతల డిప్యూటీ కమిషనర్ భాస్కరన్, మదురై రాష్ట్ర 6వ ప్రత్యేక పోలీసు బెటాలియన్ కమాండర్‌గా, చెన్నై రైల్వే ఎస్పీ సుగుణాసింగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.