నవతెలంగాణ – చెన్నై: నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. కర్మాగారాలు, వాణిజ్యం డైరెక్టర్ అర్చన పట్నాయక్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వృత్తుల సంస్థ కార్యదర్శిగా, గనుల శాఖ డైరెక్టర్ నిర్మల్‌రాజ్ కర్మాగారాలు, వాణిజ్యం డైరెక్టర్‌గా, ఆహార సరఫరా, వినియోగదారుల భద్రత శాఖ కమిషనర్ పూజా కులకర్ణి గనుల శాఖ కమిషనర్‌గా, గ్రామీణా భివృద్ధి శాఖ కమిషనర్ మీనా ఆహార సరఫరా, వినియో గదారుల భద్రత శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.