నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్-2 ఐజీపీగా పనిచేస్తున్న తరుణ్ జోషిని రామగుండం సీపీగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.