– ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 14 మంది ఉపాధ్యాయులు బదిలీ
నవతెలంగాణ – మల్హర్ రావు
మోడల్ స్కూల్ టీచర్ల చిరకాల వాంఛ నెరవేరింది. ఉద్యోగాల్లో చేరిన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మండలంలోని ఎడ్లపల్లీ గ్రామంలోని మోడల్ స్కూల్లో 14 మంది టీచర్లు రిలీవ్ అయి బదిలీ అయిన చోటకు వెళ్లిపోయారు.ఇక్కడికి రావాల్సిన వారు సైతం వచ్చే శారు.
అవాంతరాలు తొలిగిపోవడంతో..
అందరిలాగే తమకు బదిలీలకు అవకాశం ఇవ్వాలని ఏళ్ల తరబడి మోడల్ స్కూల్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గతేడాది జూలైలో బదిలీలకు షెడ్యూల్ జారీ చేసింది. దీంతో టీచర్లు ఆన్లైన్ ద్వారా బదిలీలకు నమోదు చేసుకు న్నారు. ఈ క్రమంలోనే సర్వీస్ పాయింట్ల కేటాయింపుపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం స్టే ఇవ్వడంతో బదిలీల ప్రక్రియ ఆగిపోయింది.సుదీర్ఘ వాదనల తర్వాత ఇటీవల హైకోర్టు మెరిట్, సీనియారిటీ ప్రకారం బదిలీలు చేపట్టవచ్చని తీర్పునిచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది.
రిలీవ్ అయిన ఉపాధ్యాయులు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు) 13, టీజీటీ (ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్లు) ఆరుగురు, ఇద్దరు ఒకేషనల్ టీచర్లు మొత్తం 14 మంది బదిలీ అయ్యారు.
సంతోషంగా ఉంది.. వెంకటేష్ ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్
ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ , టీచర్ గా 11 ఏళ్ల పాటు పనిచేశాను. మూడేళ్లుగా బదిలీ కోసం ఎదురుచూస్తున్నా, శుక్ర వారం రాత్రి ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్హులు జారీ చేసింది.కరీంనగర్ జిల్లా వినవంక మండలాని రిలీవ్ ఉత్తర్వులు వచ్చాయి. సంతోషంగా ఉంది. ఇక్కడి విద్యార్థులతో మంచి బంధం ఏర్పడింది. బదిలీ కావడం సంతోషం గా ఉన్నా.. విద్యార్థులను వదిలి వెళ్లడం కొంచెం బాధగా ఉంది..