తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది.ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చింది. ఎన్నికల జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై పరిశీలించింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రచారకర్తగా తొలిసారి ఒక ట్రాన్స్‌జెండర్‌ ఎంపిక చేశారు. ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్‌ ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇందు కోసం పేరున్న నటులు, సెలబ్రిటీలు, సామాజిక వేత్తలను ప్రచారకర్తలుగా ఎంపిక చేస్తుంది. అయితే ఈసారి వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ లైలాను ఎంపిక చేశారు.

Spread the love