– బీబీనగర్ ఏయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ బాటియా..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని చేర్చేదిశగా ప్రయత్నం జరుగుతుందని బీబీనగర్ ఏమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా అన్నారు. జూన్ 27 ప్రైడ్ నెల సందర్భంగా బీబీనగర్ ఎయిమ్స్ హాస్పటల్లో ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరై, మాట్లాడారు. లింగమార్పిడి సంఘం తరచుగా వివక్షకు గురవుతుందని, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందకుండా వారిని అడ్డుకుంటుందని అన్నారు. లింగమార్పిడి కమ్యూనిటీకి శిరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో అవగాహన శిక్షణ కూడా ఒక ప్రధాన అంశం అన్నారు. ట్రాన్స్ జెండర్ల కు హార్మోనల్ తెరపిని అందించడంలో బీబీనగర్ ఎయిమ్స్ ముందుంటుందని, త్వరలో లింగ నిర్ధారణ సర్జరీలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీకి ఎమ్మెల్యే రచన పై ట్రాన్స్ హెల్త్ ప్రాతినిధ్యం వహించగా, ఎమ్ఐ టిఆర్ నారాయణగూడ క్లినిక్, కీర్ బంద్ పేరెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఎంఎస్ ముకుంద, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎండోక్రీనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలవాణి, డాక్టర్ విశాఖ జైన్, డాక్టర్ రోహిత్, డాక్టర్ మాలతేష్ అవగాహనలో లింగమార్పిడి పై తగిన సూచనలు చేశారు.