ఇసుక రవాణను పూర్తిగా నిషేదించాలి

– తహసీల్దార్ కు గాగీల్లపూర్ గ్రామస్తుల వినతిపత్రమందజేత 
నవతెలంగాణ – బెజ్జంకి 
ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణ పనుల అవసరాలకు అధికారులు ఇసుక తరలింపుకు అనుమతులు జారీ చేస్తే..అనుమతుల పేరునా రవాణదారులు ఇసుకను అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారని మోయతుమ్మెద వాగులో ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేదించాలని మండల పరిధిలోని పలువురు గాగీల్లపూర్ గ్రామస్తులు శుక్రవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్ కు వినతిపత్రమందజేశారు. అక్రమ రవాణదారులు ఇష్టారాజ్యాంగ ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని.. సాగుచేసిన పంటలు నీరందక ఆందోళన చెందుతున్నామని రైతులు తహసిల్దార్ వద్ద అవేదన వ్యక్తం చేశారు.
Spread the love