నెల్లూరులో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు…10 మందికి గాయాలు

నవతెలంగాణ – అమరావతి: నెల్లూరులో అదుపుతప్పింది ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మరణించగా 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపు బట్టో సమీపంలో అదుపుతప్పింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.  డివైడర్ను దాటి కంటైనర్ను ఢీ కొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. అయితే.. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా.. మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటు క్షతగాత్రులను చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. విజయవాడ నుంచి చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love