రోడ్డు ప్రమాదంలో ట్రెజరీ ఉద్యోగి మృతి

Road-Accidentనవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు దుర్మరణం చెందారు. వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్రవాహానాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రామగుండం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సబార్డినేటర్ గా పని చేస్తున్న మహ్మద్ అబ్దుల్ ఖదీర్ (54) ద్విచక్రవాహనంపై విధులకు బయలు దేరాడు. బసంత్ నగర్ టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొనగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ద్విచక్ర వాహానాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఖదీర్‌ కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని బసంత్ నగర్ పోలీసులు 108 లో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love