వర్షపు నీటి నుండి చెట్లను కాపాడుకోవాలి

– డీఆర్‌డీఓపీడీి ప్రభాకర్‌
నవతెలంగాణ-కేశంపేట
ఎడతెరిపి వర్షాలు కురవడం కారణంగా నర్సరీలలో వర్షపు నీరు నిలువ ఉండి చెట్లు పాడైపోయే ప్రమాదం ఉందని ఎప్పటికప్పుడు ఆ నీటిని తొలగించి చెట్లను కాపాడుకోవాలని డిఆర్‌డిఓపిడి ప్రభాకర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన కేశంపేట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అల్వాల గ్రామంలో జరుగుతున్న హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులలో పాల్గొని ఆయన మొక్కలు నాటారు. గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించారు. ఎక్లాస్‌ ఖాన్‌ పేట గ్రామంలో ఫీల్డ్‌ విజిట్‌ చేసి అక్కడి ఐకెపి సిబ్బందికి పలు సూచనలు,సలహాలు ఇచ్చారు. అనంతరం మండల మహిళా సమాఖ్య కార్యాలయ ఆవరణలో సెర్ప్‌ సిబ్బందితో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డిఓపీడీ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పండిస్తున్న కూరగాయలను మార్కెట్‌ కు తరలించేందుకు మండల మహిళా సమాఖ్యకు ట్రాలీ ఆటోను మంజూరు చేశామని వివరించారు. ప్రభుత్వం మహిళా సమాఖ్యకు అందజేస్తున్న ట్రాలీ ఆటోను సద్వినియోగం చేసుకునే విధంగా మహిళా సమాఖ్య సిబ్బంది కషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపిడి జంగారెడ్డి, డీపీిఎం బాలరాజు, నరసింహ ఏపీఎంలు శిరీష, భగవంతు, ఏపీవో అజీజ్‌ ఐకెపి సిబ్బందితోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love