అమరావతి :ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో టిడిపి అధినేత చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి నమోదుచేసిన కేసులో విజయవాడలోని ఎసిబి కోర్టులో శుక్రవారం పిటి వారెంటు విచారణకు వచ్చింది. దీనిపై సిఐడి తరఫున న్యాయవాది మెమో దాఖలు చేశారు. ఈ నెల 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చి చెప్పినందున ఈ పిటి వారెంటు విచారణను ఎసిబి కోర్టు డిసెంబరు ఒకటికి వాయిదా వేసింది. ఇదే ఫైబర్‌నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తులను అటాచ్ చేయాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పైనా కోర్టు విచారణ జరిపింది. పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది.