మహిళలలో నైపుణ్య పెంచేలా ముగ్గుల పోటీలు

– బహుమతులు అందజేసిన హుస్నాబాద్ ఎస్ ఐ
నవ తెలంగాణ –  హుస్నాబాద్ రూరల్
మహిళలలో నైపుణ్యం పెంచేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు పందిల్ల సర్పంచ్ తోడేటి రమేష్ , హుస్నాబాద్ ఎస్ ఐ తోట మహేష్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గ్రామంలోని మహిళా సోదరిమణులు ఎంతో ఆసక్తికరంగా పాల్గొన్నారు. చిన్నారులు సైతం ముగ్గులు వేయడానికి ముందుకు వచ్చారని, అందరు కూడా ఆకర్షనీయంగా ముగ్గులు వేశారని ఎస్ఐ మహేష్ అన్నారు. ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఎంపిక చేయడం చాలా కష్టంగా మారిందని, అందరూ కూడా అద్భుతంగా ముగ్గులు వేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్, ఉపసర్పంచ్ నెల్లి శ్రీనివాస్, వార్డ్ మెంబర్స్ బొమ్మగాని ఎల్లయ్య, తాడూరి బాబు, రాజేశ్వరి ,చిట్ల మమత, పద్మ, శంకర్ రెడ్డి , తాటికొండ రాజశేఖర్ రెడ్డి , తాడూరి లక్ష్మణ్ , పోలవేణి మహేష్ ,డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love