నవతెలంగాణ- అశ్వారావుపేట: బీజేపీ అనుబంధ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, స్థానిక నియోజక వర్గం బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భూక్యా ప్రసాద్ భాజపా ప్రాధమిక సభ్యత్వానికి, గిరిజన మోర్చా ప్రాతినిధ్యం కు బుధవారం రాజీనామ చేసారు. ఈ రాజీనామాను రాష్ట్ర అద్యక్షులు జి.కిషన్ రెడ్డి పంపుతున్నట్లు, దీన్ని ప్రతిని జిల్లా అద్యక్షులు కె.వి రంగా కిరణ్ కు పంపుతున్నట్లు తన స్వగృహంలో విలేకర్లు సమావేశం పెట్టి ప్రకటించారు. స్థానికుడు అయిన ప్రసాద్ వైద్య విద్యను అభ్యసించి ప్రభుత్వ వైద్యుడిగా అశ్వారావుపేట లోనే పనిచేస్తూ ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి 2014 లో స్వతంత్ర అభ్యర్ధిగా అశ్వారావుపేట నియోజక వర్గంలో పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో ఈయన 2,688 ఓట్లు పొందారు. 2018 లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ పడినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో కేవలం 1,303 ఓట్లు మాత్రమే సాధించారు. ఈ ఎన్నికల్లో తిరిగి పోటీలో ఉండాలని చూసినప్పటికీ రాజకీయ పార్టీల పొత్తు ధర్మంలో భాగంగా జన సేనకు కేటాయించడంతో చేసేదేమి లేక రాజీనామా చేసినట్లు సమాచారం.