నవతెలంగాణ – జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండల్ లోని వల్లెంకుంట గ్రామంలో చిట్టెల ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. వల్లెకుంట గ్రామంలోని మలహర్ మండల రజక సంఘం అధ్యక్షుడు పావిరాల ఓదెలు ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన వీరవనిత భూమి కోసం, భూక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత చిట్టెలి ఐలమ్మ 38వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పావురాల చిన్న మల్లయ్య, రాము తిరుమల్, గట్టయ్య బాపు, ఐటిపాముల బాబు, వెంకటేష్, లక్ష్మణ్, రవీందర్, సతీష్, తిరుపతి, శ్రీనివాస్, అజిత్, అభిరామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.