నవతెలంగాణ – ఆమనగల్
ఆమనగల్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న శ్యాంసుందర్ బదలీ అయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్తున్న కమిషనర్ కు మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గం ఆధ్వర్యంలో సన్మాన, అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య లు కౌన్సిలర్లు సిబ్బందితో కలిసి కమిషనర్ శ్యాంసుందర్ ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. నాలుగు సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో నిబ్బద్దతతో పనిచేసి, ప్రజల మన్ననలు చూరగొన్నారని వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు సుండూరు ఝాన్సీ శేఖర్, గోరటి జ్యోతి నర్సింహ, సుజాత రాములు, తల్లోజు విజయ్ కృష్ణ, చెక్కల లక్ష్మణ్, చెన్నకేశవులు, విక్రమ్ రెడ్డి, కృష్ణ యాదవ్, కృష్ణ నాయక్, మున్సిపల్ సిబ్బంది రామకృష్ణ, షర్ఫుద్దీన్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.