నవతెలంగాణ -తాడ్వాయి
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆదివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం విధితమే. సోమవారం మండలంలోని కాలపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గద్దర్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని వారు గుర్తు చేసుకున్నారు. నిరంతరం సామాజిక న్యాయం కోసమే బ్రతికిన గద్దర్ మరణం ఊహించలేదన్నారు. గద్దర్ కు తెలుగు జీతాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయని తెలిపారు. గద్దర్ మృతి పట్ల మండలంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు, మహిళా సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. తన గలంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాలు పౌర హక్కుల పోరాటంలో ఒక శకం ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు తిప్పనపల్లి ఎల్ల స్వామి, పురి సమ్మయ్య, పురుషోత్తం నారాయణ, రాజబాబు, నర్సింహులు, ధర్మయ్య, శీను, సురేష్, భూషబోయిన శంకరయ్య, నల్లమొక్క రవి, సిద్దబోయిన నరసింహారావు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.