గ్రామపంచాయతీ కార్మికులకు సన్మానం

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పోతరం ఎస్ గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను బుధవారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొప్పుల రాములు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామంలో పరిశుభ్రత, మురికి కాలువలు శుభ్రం, చెత్త తీసివేత గ్రామ అభివృద్ధిలో కార్మికుల సేవలు ఉన్నతమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, ఎంపిటిసి శ్రీనివాస్, వర్డుసభ్యులు ఈశ్వర్ రెడ్డి,ఎల్లయ్య, కవిత, సరిత, లత, స్వరూప ,సరిత పాల్గొన్నారు.

Spread the love