జైలుకు చంద్రబాబు .. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళి

నవతెలంగాణ- హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడంలో వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి చాలా సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతిపరుడనే విషయం ఏసీబీ కోర్టు తీర్పుతో ప్రజలందరికీ తెలిసిందని చెప్పారు. 74వ ఏట ఎన్టీఆర్ ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు.. చాలా విచిత్రంగా ఆయన 74వ ఏట క్షోభను అనుభవించాల్సి వచ్చిందని అన్నారు. ఇన్నేళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు… ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ను హింసించిన పాపం ఇప్పుడు పండిందని అన్నారు.

Spread the love