నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకినపల్లి రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం దివంగత నేత చైర్మన్ కుసుమ జగదీష్ కు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. అమరహే జగదీష్ అన్న అంటూ నినాదాలు కోరుతూ మండలం మార్మోగిపోయింది. జగదీష్ అన్నతో ఉన్న సంబంధాలు నెమరు వేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తాము బ్రతికున్నంత వరకు అన్నతో ఉన్న సంబంధాలు చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు. జగదీశ్వర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడతామని అన్నారు.