గణిత ఉపాధ్యాయుడు యాప సమ్మయ్యకు సన్మానం

నవతెలంగాణ-గోవిందరావుపేట
డా” సర్వేపల్లి రాధాకృష్ణన్  జన్మదినం పురస్కరించుకొని మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కర్లపల్లి గణిత ఉపాద్యాయుడు యాప. సమ్మయ్యని ఐటిడిఏ, స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికైన సందర్బంగా  ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ, ఏటూరునాగారం అంకిత్ ఐఏఎస్ డిడి, పోచం, డైప్యూటీ డిఈవో,  సారయ్య, ఏసిఎంవో, శ్రీ. రవీందర్, జిసిడివో, పెనక. సుగుణలు ఘనంగా సన్మానించారు. గణితంలో వందకు 100 శాతం ఫలితాలు సాధించడంతో పాటు వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.  సాంబయ్య ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్తి శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేసారు.
Spread the love