అక్షర రూపశిల్పి ఎంహెచ్ : బి. వెంకట్

నవతెలంగాణ-హైదరాబాద్ : అక్షరాల‌ రూపశిల్పి కామ్రేడ్ మోటూరు హన్మంతరావు అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ప్రజాశక్తి తొలి సంపాదకులు మోటారు హన్మంతరావు వర్ధంతి సభ ఎమ్ హెచ్ భవన్ లో ఆదివారం ఎడివిటి జనరల్ మేనేజర్ ఎ.వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బి. వెంకట్ మాట్లాడుతూ.. ఎంహెచ్ కు రాజకీయాలతో పాటు సాహిత్యంపై కూడా మంచి పట్టు ఉందని తెలిపారు .ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో సీపీఐ(ఎం) ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. సామాజిక అంశాలపైన ఆయనకు మంచి అవగహన కలిగి ఉండేవారన్నారు. ప్రజశక్తి పత్రికకు సుదీర్ఘకాలం ఆయన ఎడిటర్ గా సేవలు అందిస్తూ పత్రిక ఉన్నతికి దోహదపడ్డారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్, ఇంఛార్జి ఎడిటర్ రాంపల్లి రమేష్, జనరల్ మేనేజర్స్, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు, మేనేజర్స్ , సిబ్బంది పాల్గొని ఎంహెచ్ కు ఘన నివాళి ఆర్పించారు.

Spread the love