నవతెలంగాణ-అచ్చంపేట : ఎస్ డబ్ల్యూ ఎఫ్ యూనియన్ రీజినల్ కార్యదర్శి ఎన్నికైన అచ్చంపేటకు చెందిన వెంకటయ్య ను సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, విడుదల సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మల, సిఐటియు సీనియర్ నాయకులు రాములు శివకుమార్ లు ఘనంగా సన్మానించారు. నిరంతరం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నాయకుడిగా పోరాటాలు గుర్తింపు ఉన్న నాయకుడిగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజనల్ కార్యదర్శిగా ఎస్ వెంకటయ్య ఎన్నికైన సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరంతరం ఆర్టీసీలో ఎదురవుతున్న సమస్యలపై కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న నాయకుడికి గుర్తింపు వచ్చిందన్నారు. రాబోయే కాలంలో అన్ని డిపోలలో ఎస్డబ్ల్యుఎఫ్ యూనియన్ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరుతూ సిఐటియు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని వారు అన్నారు.