రైతు బంధు జిల్లా అధ్యక్షులు జోగేశ్వరరావు కు సన్మానం

నవతెలంగాణ – అశ్వారావుపేట

సోమవారం నారంవారిగూడెం ఆయిల్ పామ్ నర్సరీలో జరిగిన ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ ప్రధమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు,దమ్మపేట సొసైటీ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు ను సొసైటీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఇటీవల ఈయన టి.ఎస్ ఆయిల్ఫెడ్ అడ్వైజరీ కమిటీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు. సందర్భంగా అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాంమోహన్ రావు, తుంబూరు మహేశ్వర రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, దారా తాతారావు, చీకటి బాలాజీ, దొడ్డ లక్ష్మినారాయణ, మోరంపుడి శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.
Spread the love