ఏకేజీ భవన్ లో సీతారాం ఏచూరికి పలుపురు నివాళి

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని శనివారం విప్లవ వీరుడికి నివాళులర్పిస్తుంది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, వామపక్ష ప్రగతిశీల ఉద్యమాల నాయకుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఉదయం 11 గంటలకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్ కు తీసుకువచ్చారు. పార్టీ నేతలు ఇతర పార్టీల నేతలు, ప్రజలు కర్యకర్తల సందర్శనార్ధం మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకేజీ భవన్‌లో ఉంచనున్నారు.  ఏకేజీ భవన్ లో తొలుత పార్టీ పోలిట్ బ్యూరో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికాయానికి నివాళులర్పించింది. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, బీజేపీ జాతీయా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేరళ సీఎం పినరాయి విజయన్, వివిధ ప్రజా సంఘల జాతీయ నాయకులు, అప్ సినీయర్ నాయకులు మనీష్ సిసోడియా, యన్ సీ పీ అధినేత శరత్ పవార్, తదితరులు నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా తదితరులు నివాళులర్పించారు. ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ఏకేజీ భవన్‌కు వచ్చి సీతారాం ఏచూరికి నివాళులర్పించారు.
కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అస్సాం, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల సిపిఎం నేతలు సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ఎయిమ్స్‌ వరకు అంతిమ యాత్ర సాగుతుంది. అనంతరం ఆయన కోరుకున్న విధంగా భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు కుటుంబ సభ్యులు అప్పగిస్తారు. ఎయిమ్స్‌ నుంచి జెఎన్‌యుకు తీసుకొచ్చి స్టూడెంట్స్‌ యూనియన్‌ హాలులో శుక్రవారం సాయంత్రం ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు జెఎన్‌యులో నివాళులర్పించే కార్యక్రమం కొనసాగింది. ఆ తరువాత ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల సందర్శనార్థం వసంత్‌ కుంజ్‌లోని నివాసానికి తరలించారు. ఆ తరువాత మెడికల్‌ స్టడీస్‌ కోసం ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కి అందజేయనున్నారు.

Spread the love