సీతారాం ఏచూరికి మునుగోడులో ఘన నివాళి..

నవతెలంగాణ – మునుగోడు
సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందగా గురువారం  మునుగోడు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో  మండల కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మిర్యాల భారత్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి మృతి సీపీఐ(ఎం) పార్టీకి తీరనిలోటు అని అన్నారు. ఏచూరి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు  యాస రాణిశ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, నవ తెలంగాణ రిపోర్టర్ నరేష్, ఎండి సిద్దిక్ ,యాస రాణి వంశీ, శివ, యాట గణేష్ , శ్రీకాంత్  తదితరులు ఉన్నారు.
Spread the love