నవతెలంగాణ – కంటేశ్వర్
భారతదేశం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నూట ఒక్కటవ జయంతి పురస్కరించుకొని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు నిజామాబాద్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ లో గల బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు బుధవారం అర్పించారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ గౌరవ అధ్యక్షులు కంజర్కర్ భూపతి రావు లు మాట్లాడుతూ.. బహుముఖ ప్రజ్ఞాశాలీ బహు భాషా కోవిదుడు అపర చాణక్యుడు పీవీ నరసింహారావు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బ్రహ్మాండంగా నిర్వర్తించిన గొప్ప మేధావి అని కొనియాడుతూ.. కేంద్ర ప్రభుత్వము పీవీ నరసింహారావుకి వెంటనే భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంగం కోశాది కారి రమేష్ కులకర్ణి పుల్కల్ సభ్యులు లక్ష్మి నారాయణ భరద్వాజ్ అప్పల కిష్టయ్య కోస్లీ చంద్రశేఖర్ వాస్తు సుధాకర్ జయంత్ జగపతిరావు అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.