నవతెలంగాణ- ఆర్మూర్
ప్రజా గాయకుడు సాయిచంద్ గుండెపోటుతో అకాల మరణం చెందడం విచారకరం. ఆయనకు నివాళి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అరుణోదయ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాగన్న కార్యదర్శి దాస్ లు గురువారం తెలిపారు. సాయిచంద్ విద్యార్థి దశలో పిడిఎస్యు నాయకుడిగా పనిచేస్తూ, అరుణోదయ కళాకారుడుగా పనిచేశాడని వారు తెలిపారు. ప్రజా సమస్యలపై పాటలు రచించి, గానం చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో తన పాట మాటతో ప్రజల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే!. ప్రజా కళాకారుడిగా ఆయన కృషిని అరుణోదయ అభినందిస్తుంది. ఆయన మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని అన్నారు.